జస్టిస్ ఎన్వీ రమణను ఆకాశానికెత్తేసిన 'ఆంధ్రజ్యోతి'.!
By Medi Samrat
గడిచిన నెలరోజులుగా దేశవ్యాప్త చర్చ రేపుతున్న 'మహారాష్ట్ర రాజకీయం' సుప్రీం తీర్పుతో ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఈ కేసులో తీర్పు వెలువరించిన జస్టిస్ ఎన్వీ రమణను మాత్రం ఆంధ్రజ్యోతి పత్రిక ఆకాశానికెత్తేసింది. జస్టిస్ ఎన్వీ రమణది కృష్ణా జిల్లా పొన్నవరం. తీర్పు బీజేపీకి వ్యతిరేకంగా వెలువడిన నేఫథ్యంలో... ఆంధ్రా ప్రాంతానికే చెందిన జస్టిస్ ఎన్వీ రమణను ఓ రేంజ్ లో కొనియాడే ప్రయత్నం చేసింది.
రాజకీయాల్లో బేరసారాలను నిలవరించేందుకు, అనిశ్చితి లేకుండా చేయాలని, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని ఉత్తర్వులు ఇవ్వాలన్న అభిప్రాయానికొచ్చామని.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తికి మెజారిటీ తేల్చేందుకు తక్షణం బలపరీక్ష జరగడం అవసరమని మేం భావిస్తున్నామని జస్టిస్ రమణ పేర్కొన్న విషయాన్ని కథనంలో హైలట్ చేస్తూ.. ఫోటోతో సహా పతాక శీర్శికల్లో ప్రచురించి కీర్తించకనే కీర్తించింది.
బీజేపీకి మింగుడుపడని ఈ తీర్పును హైలెట్ చేయడం కోసం.. భారతదేశ రాజ్యాంగం 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభవేళ రాజ్యాంగ సంప్రదాయాలకు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పును వెలువరించిందంటూ సదరు పత్రిక జాగ్రత్తగా తన పని తాను చేసే ప్రయత్నం చేసింది.