టమాటాలు తినండి.. దాన్ని బాగా పెంచుకోండి.!
By అంజి Published on 30 March 2020 7:29 AM GMTమనం రోజు ఎన్నో రకాల కూరగాయలను ఆహారంలో తీసుకుంటాం. అలాంటి వాటిలో టమాటా ఒకటి. రోజువారీ వంటల్లో ఎన్నో రకాలుగా టమాటాలను ఉపయోగిస్తుంటారు. టమాటా లేకుండా చాలా మంది వంట కూడా చేయరు. అంతలా టమాటా మన ఆహార భాగస్వామిగా మారింది. ఎర్రగా నిగ నిగ లాడే టమాటాను పలు విధాలుగా తింటాం. జ్యూస్ చేసుకోవడం, సలాడ్లలో మిశ్రమంగా కలపడం, ఇంకా సూప్‌లలో కలిపి దాని కమ్మని రుచి ఆస్వాదిస్తాం. టామాలు తినడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి.. మరీ
టమాటా లాభాలు..
టమాటాలు.. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని పచ్చిగా తింటే యాంటీ ఆక్సిడెంట్లు అంది.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కనుక టమాటాలను పచ్చిగా తినడం బెటర్. శరీరం శక్తివంతంగా ఉండేందుకు టమామాలు చాలా సాయపడతాయి. టామటా రసం తాగితే చాలా మంచిది. టమాటాలు తినడం ద్వారా లైకోపీన్, బీటా-కెరోటిన్‌ను శరీరంలో పూర్తిగా భర్తీ చెయొచ్చు. టమాటా రసం.. జలుబు, ఫ్లూ వ్యతిరేకంగా పని చేస్తుంది.
ఆస్పత్రి నుంచి విడుదలైన ఆస్తమా రోగులకు టమాటా ఓ తాజా సూపర్‌ఫుడ్‌గా పని చేస్తుందని ఓ అధ్యయనంలో తెలిసింది. మన శరీరంలో టమాటాలు చాలా బలమైన రోగనిరోధక ప్రతిస్పందనను కలిగి ఉండటానికి సాయపడతాయి.
ఇక టామాలో ఉండే లైకోపీన్ చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సైతం ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. టమాటాలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడతాయి.
క్యాన్సర్‌ను అడ్డుకునే గుణాలు టమాటాలో ఉన్నాయి. టామాలోని లైకోపీన్, కొలన్, ప్రోస్టేట్, లంగ్ క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. రక్తం గడ్డకట్ట కుండా ఉండాలంటే టమాటాలు తినాలి. బీపీని తగ్గించే లక్షణాలు కూడా టమాటాలకు ఉన్నాయి. హైపర్ టెన్షన్, డయాబెటిస్, గుండె సమస్యలు ఉన్నవారు టమాటాలు తినడం మంచిది. చర్మం కోసం టమాటాలు తినాలి. అవి బయోటిన్, విటమిన్ సీ ప్రోటీన్ల ఉత్పత్తిని క్రమబద్ధీకరిస్తాయి. దీని వల్ల ముసలితనం రాకుండా ఉంటుంది.
ప్రపంచంలో మూడు వేల రకాల టమాటాలు ఉన్నాయి.
టమాటాలు సానుకూలమైన ఆరోగ్య ప్రయోజనాలకు కలిగి ఉన్నప్పటికీ, వీటిని అధికంగా ఉపయోగించడం వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి.