వెంకీమామ పై నాగ్ అల‌క వెన‌క అస‌లు క‌థ ఇదేనా..?

By Newsmeter.Network  Published on  17 Dec 2019 5:28 AM GMT
వెంకీమామ పై నాగ్ అల‌క వెన‌క అస‌లు క‌థ ఇదేనా..?

విక్ట‌రీ వెంక‌టేష్, యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్ లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీమామ‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ ఫ్యామీలీ ఎంట‌ర్ టైన‌ర్ బ్లాక్ బ‌ష్ట‌ర్ టాక్ తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. అయితే... నాగార్జున ఈ మూవీకి సంబంధించిన ఏ పంక్ష‌న్ కి హాజ‌రు కాక‌పోవ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై వార్త‌లు రావ‌డంతో ఆఖ‌రికి రిలీజ్ ముందు రోజు ట్విట్ట‌ర్ లో నాగ్ వెంకీమామ గురించి స్పందించారు.

నాగ్ స్పందించిన‌ప్ప‌టికీ... ఎందుక‌నో వెంకీమామ సినిమా విష‌యంలో నాగ్ అసంతృప్తిగా ఉన్న‌ట్లుగా ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే... ఈ సినిమాలో చైత‌న్య త‌ల్లిదండ్రులు చ‌నిపోతే.. మావ‌య్యే పెంచి పెద్ద చేస్తాడు. వీటితో పాటు కొన్ని స‌న్నివేశాలు ఆయ‌న‌కు న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల‌నే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కి నాగ్ దూరంగా ఉంటున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే... నాగార్జున‌, ల‌క్ష్మి (చైత‌న్య మ‌ద‌ర్) విడిపోయిన‌ప్ప‌టికీ.. చైత‌న్య‌ను ద‌గ్గుబాటి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఇద్ద‌రు బాగానే చూసుకున్నారు.

సినిమా వేరు, నిజ జీవితం వేరు. సినిమాలో ఆ స‌న్నివేశం ఉంద‌ని.. నాగ్ ఈ మూవీ పై అలిగార‌ని అనుకోవ‌డం క‌రెక్ట్ కాదు. నాగార్జున, అన్న‌య్య వెంక‌ట్ కొడుకు ఆదిత్య నిశ్శితార్థం హాడావిడిలో ఉన్నారు. అలాగే త‌న కొత్త సినిమాకి సంబంధించిన వ‌ర్క్ లో కూడా బిజీగా ఉన్నారు. అందుక‌నే వెంకీమామ ఫంక్ష‌న్స్ కి రాలేక‌పోయార‌నుకుంట‌. ఏది ఏమైనా వెంకీమామ మాత్రం అంచ‌నాల‌కు మించి స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల‌కు ఫుల్ స్టాఫ్ పెట్టేలా వెంకీమామ‌ గ్రాండ్ స‌క్స‌స్ మీట్ కైనా నాగ్ వ‌స్తారేమో చూడాలి.

Next Story
Share it