ప‌వ‌న్ కి రూ.50 కోట్లా ! దిల్ రాజు ధైర్యం ఏంటి ?

By రాణి  Published on  16 Dec 2019 3:30 PM GMT
ప‌వ‌న్ కి రూ.50 కోట్లా ! దిల్ రాజు ధైర్యం ఏంటి ?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సినిమా చేయాల‌నేది నిర్మాత దిల్ రాజు డ్రీమ్. చాలా సార్లు ప‌వ‌న్ తో సినిమా చేసేందుకు ట్రై చేశారు కానీ.. వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే ప‌వ‌న్ రీ ఎంట్రీ మూవీని మాత్రం త‌నే చేయాల‌ని డిసైడ్ అయ్యాడు దిల్ రాజు. అందుకే అనుకుంట‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి రూ.50 కోట్ల రెమ్యూన‌రేషన్ ఇవ్వ‌డానికి కూడా వెనుకాడ‌టం లేదట. అవును..ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి దిల్ రాజు రూ.50 కోట్ల రెమ్యూన‌రేష‌న్ ఇచ్చేందుకు ఓకే చెప్పార‌ట‌. ఇండ‌స్ట్రీలో ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన అజ్ఞాత‌వాసి అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమా యాభై కోట్ల రూపాయలు కూడా వ‌సూలు చేయ‌లేక‌పోయింది. అలాంటిది దిల్ రాజు ఏ ధైర్యంతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి 50 కోట్లు ఇచ్చేందుకు ఓకే అన్నారు అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. దిల్ రాజు ప్లాన్ ఏంటంటే ప‌వ‌న్ కి యాభై కోట్లు ఇచ్చి, మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల రెమ్యూన‌రేష‌న్, ప్రొడ‌క్ష‌న్ ఖ‌ర్చులు ఇలా అన్నింటినీ క‌లిపి రూ.20 కోట్ల బ‌డ్జెట్ అనుకుంటున్నార‌ట‌.

ఈ లెక్క‌న ప‌వ‌న్ తో చేయాలనుకుంటున్న చిత్రం బడ్జెట్ సుమారుగా రూ.70 కోట్లు. బాలీవుడ్, కోలీవుడ్ లో స‌క్సెస్ సాధించిన పింక్ రీమేక్ క‌నుక ఖ‌చ్చితంగా తెలుగులో కూడా స‌క్స‌స్ అవుతుంద‌ని దిల్ రాజు గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జరుగుతోంది. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేయ‌నున్నార‌ని సమాచారం. మ‌రి దిల్ రాజు ప్లాన్ వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో చూడాలి.

Next Story