ఈ.. రెండు సినిమాలు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను

By Newsmeter.Network  Published on  4 Dec 2019 10:41 AM GMT
ఈ.. రెండు సినిమాలు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేను

అక్కినేని నాగ చైత‌న్య న‌టించిన తాజా చిత్రం వెంకీ మామ‌. ఇందులో మేన‌మామ వెంక‌టేష్ తో క‌లిసి నాగ చైత‌న్య న‌టించ‌డంతో ఈ ప్రాజెక్ట్ పై ఫ‌స్ట్ నుంచి మంచి క్రేజ్ ఏర్ప‌డింది. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్.. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ‌తో క‌లిసి ఈ భారీ చిత్రాన్ని నిర్మించింది.

ఏ ముహుర్తాన ఈ సినిమాని ప్రారంభించారో కానీ.. రిలీజ్ డేట్ విష‌య‌మై ఓ స‌స్పెన్స్ మూవీ చూస్తే ఎలాగైతే ఫీల‌వుతారో అలా... రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందో అని ఉత్కంఠ‌తో ఎదురు చూసారు అభిమానులు. ఎట్ట‌కేల‌కు విక్ట‌రీ పుట్టిన‌రోజు కానుక‌గా ఈ నెల 13న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. రిలీజ్ డేట్ కి త‌క్కువ టైమే ఉండ‌డంతో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేసారు.

ఈ సంద‌ర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో నాగ చైత‌న్య మాట్లాడుతూ... సురేష్ ప్రొడక్షన్స్ లో సినిమా చేయడం నా కల.. కానీ లేట్ గా జరిగిన లేటెస్ట్ ది బెస్ట్ గా జరిగింది..వెంకీ మామా తో చేయటం చాలా సంతోషం గా ఉంది. కెరీర్ లో మ‌నం, వెంకీ మామ సినిమాలు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను. ప్రేమమ్ లో చేసిన ఒక్క సీన్ కి చాలా థ్రిల్ అయ్యాను ఇంక కంప్లీట్ సినిమా అంతా కూడా అంతే థ్రిల్లింగ్ గా ఉంది. మామూలుగానే చిన్న విషయానికే సురేష్ మామ వంద సార్లు ఆలోచిస్తారు.ఇంక ఈ మూవీకి ఎలా ఆలోచించుంటారో అర్ధం చేసుకోవ‌చ్చు అన్నారు.

Next Story
Share it