ఆకాష్ పూరి 'రొమాంటిక్' లో గెస్ట్ రోల్ చేసిన హీరో ఎవ‌రు..?

By Newsmeter.Network  Published on  4 Dec 2019 6:42 AM GMT
ఆకాష్ పూరి రొమాంటిక్ లో గెస్ట్ రోల్ చేసిన హీరో ఎవ‌రు..?

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్.. త‌న‌యుడు ఆకాష్ పూరి న‌టిస్తున్న తాజా చిత్రం రొమాంటిక్. ఈ చిత్రానికి పూరి క‌థ - మాట‌లు అందించ‌గా.. పూరి శిష్యుడు అనిల్ పాడూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. హైద‌రాబాద్ లో జ‌రిగిన తాజా షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తీ చేసారు.

ఈ మూవీ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ సినిమాలో ఓ హీరో గెస్ట్ రోల్ చేసారు. ఆ హీరో ఎవ‌రో కాదు ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సొంతం చేసుకున్న ఎన‌ర్జిటిక్ హీరో రామ్. అవును.. రామ్ గెస్ట్ రోల్ చేసాడు. ఓ పాట‌లో ఆకాష్ తో క‌లిసి రామ్ డ్యాన్స్ చేసాడు. మ‌రో విష‌యం ఏంటంటే... రామ్, ఆకాష్ తో క‌లిసి పూరి కూడా స్టెప్పులు వేసాడ‌ట‌.

ప్ర‌స్తుతం ఈ సినిమా కూల్ గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. విభిన్న‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాని స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి.. మెహ‌బూబా సినిమాతో ఆక‌ట్టుకోలేక‌పోయినా ఆకాష్ రొమాంటిక్ సినిమాతో స‌క్స‌స్ అవుతాడ‌ని ఆశిద్దాం.

Next Story