సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌రిలేరు నీకెవ్వ‌రు అనే సినిమా చేస్తున్నారు. స‌క్స‌స్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. మ‌హేష్ స‌ర‌స‌న ర‌ష్మిక న‌టిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అయితే… ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు అనే విష‌యం పై క‌న్ ఫ్యూజ‌న్ ఉండేది. ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే… ప‌ర‌శురామ్, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్, వంశీ పైడిప‌ల్లి.. మ‌హేష్ త‌దుప‌రి చిత్రాన్ని ఈ ముగ్గురిలో ఎవ‌రితో చేయ‌నున్నాడు అనేది స‌స్పెన్స్ గా ఉండేది.

ఇప్పుడు ఆ స‌స్పెన్స్ కి తెర ప‌డింది. మ‌హేష్ నెక్ట్స్ మూవీని వంశీ పైడిప‌ల్లితో చేయ‌నున్నాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి వైజాగ్ లో జ‌రిగిన ఓ ఈవెంట్ లో తెలియ‌చేసారు. అంతే కాకుండా ఈ సినిమాని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించ‌నున్నార‌ని కూడా చెప్పారు. త్వ‌ర‌లోనే అఫిషియ‌ల్ ఎనౌన్స్ మెంట్ రానుంద‌ని స‌మాచారం.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.