మహేష్ తదుపరి చిత్రం ఎవరితో..?
By Newsmeter.Network
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు అనే సినిమా చేస్తున్నారు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మహేష్ సరసన రష్మిక నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే... ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో సినిమా చేయనున్నాడు అనే విషయం పై కన్ ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ మేటర్ ఏంటంటే... పరశురామ్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్, వంశీ పైడిపల్లి.. మహేష్ తదుపరి చిత్రాన్ని ఈ ముగ్గురిలో ఎవరితో చేయనున్నాడు అనేది సస్పెన్స్ గా ఉండేది.
ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెర పడింది. మహేష్ నెక్ట్స్ మూవీని వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి వైజాగ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో తెలియచేసారు. అంతే కాకుండా ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారని కూడా చెప్పారు. త్వరలోనే అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని సమాచారం.