మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ‌ల‌తో మూవీ ప్లాన్ చేస్తున్న నిర్మాత ఎవ‌ర‌నుకుంటున్నారా..? అభిరుచి గ‌ల నిర్మాత దిల్ రాజు. అవును.. దిల్ రాజు సీనియ‌ర్ హీరోల్లో నాగార్జున, వెంక‌టేష్ ల‌తో సినిమాలు నిర్మించారు కానీ.. చిరు, బాల‌య్య‌ల‌తో సినిమాలు చేయ‌లేదు. ఇప్పుడు వీరిద్ద‌రితో సినిమా ప్లాన్ చేస్తున్నారు.

చిరు, బాల‌య్య‌ల‌తో మూవీ ప్లాన్ అంటే.. వీరిద్దరు క‌లిసి ఒక సినిమాలో న‌టించ‌డం కాదండి.. చిరుతో ఓ సినిమా, బాల‌య్య‌తో ఓ సినిమా చేసేందుకు దిల్ రాజు ప‌క్కా ప్లాన్ రెడీ చేసార‌ని టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా బాల‌య్య‌ను క‌లిసార‌ట దిల్ రాజు. బాల‌య్య, దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పార‌ట‌.

దీంతో దిల్ రాజు ప్ర‌స్తుతం బాల‌య్య‌కు స‌రిప‌డే క‌థ‌ను రెడీ చేసే ప‌నిలో ఉన్నార‌ట‌. బోయ‌పాటితో చేస్తున్న సినిమా త‌ర్వాత దిల్ రాజు బ్యాన‌ర్ లో బాల‌య్య సినిమా చేస్తార‌ట‌. అయితే.. ద‌ర్శ‌కుడు ఎవ‌రు..? ఏ త‌ర‌హా క‌థ అనేది తెలియాల్సివుంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.