రవితేజ ‘డిస్కో రాజా’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్'

By అంజి  Published on  1 Dec 2019 5:20 AM GMT
రవితేజ ‘డిస్కో రాజా’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజ రవితేజ న‌టిస్తున్న‌ తాజా సినిమా ‘డిస్కో రాజా’. వైవిధ్య‌మైన‌ కథా చిత్రాల దర్శకుడు విఐ ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ స్వరపరిచిన ఈ సినిమాలోని ‘నువ్వు నాతో ఏమన్నవో’ అనే మెలోడీ సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా అలరించడంతో ఈ సినిమా పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది. సినిమా యూనిట్. టీజర్ ని డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియ‌చేసింది. ‘బ్యాడీ డాడీ ఆన్ ది వే’ అంటూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ లో రవితేజ లుక్ చూస్తుంటే, టీజర్ అదిరిపోవడం ఖాయం అనిపిస్తుంది.

ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఫోటోగ్రఫిని కార్తీక్ ఘట్టమనేని అందిస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను 2020 జనవరి 24న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Next Story