దేవిశ్రీని బాగా టెన్ష‌న్ పెడుతున్న త‌మ‌న్.. ఇంత‌కీ ఏమైంది..?

By అంజి  Published on  6 Dec 2019 7:05 AM GMT
దేవిశ్రీని బాగా టెన్ష‌న్ పెడుతున్న త‌మ‌న్.. ఇంత‌కీ ఏమైంది..?

ఒక‌ప్పుడు రాక్ స్టార్ దేవిశ్రీ ఓ సెన్సేష‌న్. ఇప్పుడు ఎస్.ఎస్. త‌మ‌న్ ఓ సెన్సేష‌న్. వ‌రుస సినిమాల‌తో అస‌లు ఖాళీ లేకుండా సినిమాలు చేస్తూ... త‌న పాట‌ల‌తో ఆడియ‌న్స్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ షేక్ చేస్తున్నాడు. సంక్రాంతి వ‌స్తున్న బ‌న్నీ మూవీ అల‌.. వైకుంఠ‌పుర‌ములో సినిమాకి త‌మ‌నే మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ సినిమాలోని రెండు పాట‌ల‌ను రిలీజ్ చేయ‌డం. ఈ రెండు పాట‌లు యూట్యూబ్ లో రికార్డు స్ధాయి వ్యూస్ తో స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేయ‌డం తెలిసిందే. ఇక సంక్రాంతికి వ‌స్తున్న మ‌రో సినిమా మ‌హేష్ బాబు స‌రిలేరు నీకెవ్వ‌రు. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. త‌మ‌న్ అందించిన అల‌.. వైకుంఠ‌పుర‌ములో సాంగ్స్ ఆల్రెడీ హిట్ అవ్వ‌డంతో స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ పై బాగా ఒత్తిడి పెరిగింద‌ట‌.

రీసెంట్ గా స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో మైండ్ బ్లాక్ సాంగ్ రిలీజ్ చేసారు. ఇందులో పాట మ‌ధ్య‌లో వ‌చ్చే మ‌హేష్ బాబు వాయిస్ బాగుంది అని టాక్ వ‌చ్చింది కానీ.. ఫుల్ సాంగ్ సూప‌ర్ అనేంత టాక్ రాలేదు. మాస్ కి బాగా న‌చ్చుతుంది. థియేట‌ర్ లో చూస్తే బాగుంటుదేమో.. ఇలాంటి కామెంట్స్ వ‌చ్చాయి. దీంతో దేవిశ్రీ మ‌హేష్ ని ఎలా మెప్పించాలి..? ఆడియ‌న్స్ ని మెప్పించేలా ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి..? అని తెగ టెన్ష‌న్ ప‌డుతున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. మ‌రి.. రాక్ స్టార్ ఈసారి ఎలాంటి సాంగ్ అందిస్తారో..?

Next Story