'ఇద్ద‌రి లోకం ఒక‌టే' .. రాజ్ త‌రుణ్‌కి విజ‌యం వరించేనా..?

By అంజి  Published on  4 Dec 2019 2:54 AM GMT
ఇద్ద‌రి లోకం ఒక‌టే .. రాజ్ త‌రుణ్‌కి విజ‌యం వరించేనా..?

యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్నల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఇద్ద‌రి లోకం ఒక‌టే'. అభిరుచి గ‌ల నిర్మాత‌ దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై శిరీష్ ఈ సినిమాని నిర్మించారు. జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఎ' స‌ర్టిఫికేట్‌ను పొందింది.

ఈ సినిమా డిసెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌ని ఎనౌన్స్ చేసారు కానీ.. రిలీజ్ డేట్ పై సస్పెన్స్ ఏర్ప‌డింది. అయితే.. ఎప్పుడైతే వెంకీ - చైతుల వెంకీమామ డిసెంబ‌ర్ 13న రిలీజ్ అని ఎనౌన్స్ చేసారో ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌చ్చేసింది. ఇంత‌కీ రిలీజ్ ఎప్పుడంటే... క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసారు.

ఈ సినిమా గురించి దిల్ రాజు స్పందిస్తూ... “మా బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది. క్యూట్ ల‌వ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను డైరెక్ట‌ర్ కృష్ణ తెర‌కెక్కించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌లు, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు. మ‌రి.. రాజ్ త‌రుణ్ కి విజ‌యం వ‌చ్చేనో..? లేదో..? 25న తెలుస్తుంది.

Next Story