సెన్సార్ బోర్డ్ పై ఆగ్ర‌హం.. సీక్వెల్ తీస్తాన‌ని శ‌ప‌థం..!

By అంజి  Published on  30 Nov 2019 9:28 AM GMT
సెన్సార్ బోర్డ్ పై ఆగ్ర‌హం.. సీక్వెల్ తీస్తాన‌ని శ‌ప‌థం..!

సంచ‌ల‌న‌ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఎప్పుడూ ఏదో విధంగా వార్త‌ల్లో ఉంటూనే ఉంటారు. వ‌ర్మ‌ తాజా చిత్రం 'క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు'. ఈ మూవీ టైటిల్ ను 'అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు' అని మార్చిన విష‌యం తెలిసిందే. ఈ వివాద‌స్ప‌ద చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ.. హైకోర్ట్ బ్రేక్ వేయ‌డంతో ఆగింది.

సెన్సార్ బోర్డ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డం.. ఇంకా సెన్సార్ కాక‌పోవ‌డం.. ఈవిధంగా సినిమా రిలీజ్ కాక‌పోవ‌డంతో వ‌ర్మ‌కి బాగా కోపం వ‌చ్చింది. అంతే.. మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసారు. ఈ సినిమాలో ఏ కులాన్ని తక్కువ చేసి చూపించలేదని.. అన్ని రూల్స్ ని నాపైనే రుద్దారు అంటూ వ‌ర్మ ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

ఏ ఒక్క పార్టీ కోసమో.. వ్యక్తి కోసమో నేను సినిమా తీయలేను. సెటైర్ కోసం మాత్రమే తీశానని అన్నారు. తాను పడి లేచే కెరటాన్ని అని ఎంత ఆపితే అంత లేస్తానని ఫైరయ్యారు. ఓటు వేసి నాయకుల్ని ఎన్నుకునే మనకు ఏ సినిమా చూడాలో.. ఏం సినిమా చూడ‌కూడ‌దో.. తెలీదా..? దానిని ముగ్గురు సెన్సార్ వాళ్లు చెప్పాలా? అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. అంతే కాకుండా... 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' మూవీకి సీక్వెల్ తీస్తానని శ‌ప‌థం చేసారు.

Next Story