వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం ‘క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు’. ఈ చిత్రాన్ని ఈ నెల 29న అన‌గా రేపు రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే.. ఇప్పటి వరకు చిత్రానికి సెన్సార్ ఇవ్వలేదన్న సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు తెలిపారు. వారం రోజుల్లో సినిమా ను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే సినిమాలోని వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్ బోర్డ్ కి హైకోర్ట్ సూచించింది. రెండు కులాల మధ్య చిచ్చు రగిలించిన‌ టైటిల్ను మార్చాలన్న హైకోర్టు ఆదేశించింది. కాగా..ఇప్పటికే టైటిల్ ను మార్చమని రామ్ గోపాల్ వర్మ కోర్టుకి తెలియ‌చేశారు. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోర్టును రామ్ గోపాల్ వర్మ కోరారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.