నాగార్జున 'బంగార్రాజు' ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

By అంజి  Published on  2 Dec 2019 10:43 AM GMT
నాగార్జున బంగార్రాజు ఉన్న‌ట్టా..?  లేన‌ట్టా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రాల్లో సోగ్గాడే చిన్ని నాయ‌నా ఒక‌టి. ఈ సినిమా ద్వారా క‌ళ్యాణ్ కృష్ణ‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేసారు. ఆత‌ర్వాత క‌ళ్యాణ్ కృష్ణ, నాగ చైత‌న్య‌తో 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాని తెర‌కెక్కించ‌డం... అది కూడా స‌క్సస్ అవ్వ‌డం తెలిసిందే. అయితే... త‌ర్వాత క‌ళ్యాణ్ కృష్ణ‌తో సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమా చేయాల‌నుకున్నారు.

ఎప్ప‌టి నుంచో ఈ ప్రాజెక్ట్ గురించి వార్త‌లు వ‌స్తున్నాయి కానీ.. అఫిషియ‌ల్ అనౌన్స్ మెంట్ మాత్రం రావ‌డం లేదు. 'మ‌న్మ‌థుడు 2' త‌ర్వాత 'బంగార్రాజు' ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంది అనుకున్నారు కానీ.. ఈ సినిమా ఫ్లాప్ అవ్వ‌డంతో నాగార్జున ఆలోచ‌న‌లో ప‌డ్డారట‌. ఇప్పుడు 'బంగార్రాజు' కాకుండా వైవిధ్య‌మైన క‌థాంశంతో సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు.

అందుక‌నే 'ఊపిరి', 'మ‌హ‌ర్షి' చిత్రాల ర‌చ‌యిత సోల్మాన్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న‌కే ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. మ్నాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మించే ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే... బంగార్రాజు ఉన్నాటా..? లేన‌ట్టా..? అనేది స‌స్పెన్స్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కొత్త వార్త ఏంటంటే... 2020 స‌మ్మ‌ర్ త‌ర్వాత ప్రారంభించి 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నార‌ట‌. అది మేట‌రు.!

Next Story