టాలీవుడ్ ను ఈ సారి క్రిస్మస్ ఆదుకోవాలి !

By Newsmeter.Network  Published on  10 Dec 2019 11:16 AM GMT
టాలీవుడ్ ను ఈ సారి క్రిస్మస్  ఆదుకోవాలి !

టాలీవుడ్ లో ఎప్పటి నుండో సంక్రాంతికే ఎక్కువగా పోటీ ఉంటుంది. అయితే ఈ సారి టాలీవుడ్ క్రిస్మస్ ని టార్గెట్ చేసింది. ఈ క్రిస్మస్ కి స్టార్ హీరోల చిత్రాలతో పాటు యంగ్ హీరోలు కూడా తమ చిత్రాలను పోటీకి దించుతున్నారు. అయితే సంక్రాంతి స్టార్ గా పేరున్న బాలయ్య ఈ సారి సంక్రాంతిని వదిలేసి తన అభిమానులకు క్రిస్మస్ కు ట్రీట్ ఇవ్వనున్నారు. ఆయన నటిస్తున్న రూలర్ మూవీ డిసెంబర్ 20న విడుదల అవుతుంది. బాలయ్య రెండు భిన్నమైన పాత్రలో కనిపిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇక లెజెండరీ ప్రొడ్యూసర్ స్వర్గీయ రామానాయుడు డ్రీం ప్రాజెక్ట్ గా రాబోతున్న వెంకీ మామ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా క్రిస్మస్ కి రెండు వారాలు ముందే విడుదల అవుతున్నప్పటికీ రూలర్ సినిమా విడుదల ఐయ్యేవరకూ చిన్న సినిమాలు మినహా చెప్పుకోదగ్గ సినిమాలేవి విడుదలకు లేవు.

కాబట్టి బాక్సాఫీస్ వద్ద వెంకీ మామ రన్.. ఢోకా లేకుండా క్రిస్మస్ వరకు నడుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రతిరోజూ పండుగే సినిమా విడుదల కూడా డిసెంబర్ 20నే. అదేరోజు రూలర్ కూడా విడుదల నేపథ్యంలో ఈ రెండు చిత్రాలు కలెక్షన్స్ కోసం బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్నాయి. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రతిరోజూ పండుగే తెరకెక్కింది. ఇక యంగ్ హీరో రాజ్ తరుణ్ పండుగ రోజే 'ఇద్దరి లోకం ఒకటే' చిత్రంతో డిసెంబర్ 25న దిగనున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్ రాజు నిర్మించడం విశేషం. అలాగే మత్తు వదలరా కూడా 25నే రానుంది. మరి ఈ సినిమాలలో ఎన్ని హిట్ అవుతాయో చూడాలి. అలాగే ఈ క్రిస్మస్ టాలీవుడ్ కి చాల కీలకం కానుంది.

Next Story
Share it