డాషింగ్ డైరెక్టర్  పూరి జగన్నాథ్  సినిమాని ఎంత వేగంగా తీస్తాడో..  తీసిన సినిమాని  అంతే సింపుల్ గా జనం మీదకు వదిలేస్తాడని  పూరికి  పేరు ఉంది. కానీ, ఈ మధ్య పూరి  మార్కెటింగ్ లెవల్స్ చూస్తుంటే..  పూరి  పక్కా బిజినెస్ మెన్ లా మారిపోయాడనిపిస్తోంది. డబ్బుకు విలువ ఇవ్వను అని  చెప్పే ఈ డైరెక్టర్.. ఇప్పుడు లెక్కల వెంటే పరుగెడుతున్నాడు.  సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో పూరి సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.  
 
ఈ సినిమాని, పూరి  పాన్ ఇండియా మూవీలా చేయాలని, దాని ద్వారా సాలిడ్ రెవిన్యూని పట్టాలని గట్టిగానే ట్రై  చేస్తున్నాడు. ఇందులో  భాగంగానే  బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ చుట్టూ తిరుగుతుంది పూరి టీం.   విజయ్ దేవరకొండను బాలీవుడ్ లో పరిచయం చేసే బాధ్యత తీసుకున్న కరుణ్,  పూరి జగన్నాధ్ ప్రపోజల్ కి పాజిటివ్ గా  స్పందించాడు. విజయ్ దేవరకొండ – పూరి కలయికలో రాబోతున్న ‘ఫైటర్‌’ మూవీని  అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించనున్నారు. 
 
ఈ మేరకు  ఈ రోజు  ముంబైలో కరణ్ జోహర్‌ తో పూరి టీం మీటింగ్ పెట్టింది. ఫైటర్‌ ను పాన్ ఇండియన్ మూవీగా  చేద్దామనే ప్రతిపాదనతో వెళ్లి కథ వినిపించారు.  కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు తెలుస్తోంది.  త్వరలోనే  ఫైటర్ నిర్మాతల్లో ఒకరిగా కరణ్ జోహార్ పేరును అధికారికంగా  ప్రకటించనున్నారు.  కాగా ఈ సినిమాలో  కియారా అద్వానీ  విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.  ఇప్పటికే  వీరిద్దరూ ఓ యాడ్ ఫిల్మ్ లో కలిసి నటించారు.  

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్