అమృత సత్యన్నారాయణ క్రియేషన్స్ పై కొత్త సినిమా...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Dec 2019 12:12 PM GMT
అమృత సత్యన్నారాయణ క్రియేషన్స్ పై కొత్త సినిమా...

సుమన్ కవిత ప్రధాన పాత్రలో అలం సందీప్, ప్రమీల హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రానికి బొంతు శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఏ.వి.భాస్కర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మంచిర్యాల, కోనసీమల్లో రెండు షెడ్యూల్స్ని పూర్తీ చేశామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తవుడుందని తెలిపారు. జనవరి 24న ఆడియో పాటలు విడుదల చేస్తామన్నారు. కొత్తగా సినిమాని నిర్మిస్తున్న మాకు సుమన్, కవిత గారు మంచి సపోర్ట్ చేశారని . నటి నటుల టెక్నీషియన్స్ సహకారం బాగుందని. మంచి కథతో మంచి సినిమాని నిర్మిస్తున్నామన్నారు.

అనంతరం దర్శకుడు మాట్లాడుతూ.. విభిన్న కథ కథనాలతో నేటి ట్రెండ్ కి తగ్గట్టు గా ఈ సినిమా వుంటుంది. సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రెండు షెడ్యుల్ నీ పూర్తి చేసాము. సినిమా బాగా వస్తుంది.నిర్మాత సహకారం మరచిపోలేను. త్వరలో టైటిల్ ను ఎనౌన్స్ చేస్తాము అన్నారు. వీరితోపాటు జెన్నీ, అశా,విజయభాస్కర్, కాకినాడ నాని, సాయి వర్ధన్ గౌడ్ తదితరులు నటిస్తున్నారు.

Next Story