గోపీచంద్‌ హీరోగా సంపత్‌నంది రూపొందుతోన్న భారీ చిత్రం అప్ డేట్ ..?

By Newsmeter.Network  Published on  1 Jan 2020 6:45 AM GMT
గోపీచంద్‌ హీరోగా సంపత్‌నంది రూపొందుతోన్న భారీ చిత్రం అప్ డేట్ ..?

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోంది. ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా భూమిక, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో అజిజ్ నగర్ లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్ర్రీకరించారు. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకి రానుంది. మ్యాచోస్టార్‌ గోపీచంద్‌, మిల్కీబ్యూటి తమన్నా, దిగంగన సూర్యవంశి, భూమిక, రావురమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సౌందర్‌ రాజన్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

Next Story
Share it