పాపం రాజశేఖర్.. బాగున్నా లాభం ఏముంది ?

By అంజి  Published on  1 Jan 2020 5:16 AM GMT
పాపం  రాజశేఖర్..  బాగున్నా లాభం ఏముంది ?

రాజశేఖర్ తెలుగు ప్రేక్షుకులకు తన హీరోయిజాన్ని చూపించే ప్రయత్నం బలంగానే చేస్తున్నాడు. మధ్య మధ్యలో ఏ కార్ యాక్సిడెంట్ తోనో వార్తలు నిలిస్తుంటాడు అనుకోండి, అది వేరే విషయం. ఇటీవలే కార్ ప్రమాదం నుండి అదృష్టం కొద్దీ బయటపడ్డాడు. అయితే ప్రస్తుతం తన తరువాత చిత్రాన్ని చాల సీరియస్ గా దృష్టి పెట్టాడట ఈ సీనియర్ హీరో. 'పూలరంగడు, అహన పెళ్ళంట' సినిమాల డైరెక్టర్ వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో సరికొత్త తరహా జోనర్ లో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో రాజశేఖర్ నటిస్తున్నాడు.

కాగా ఈ సినిమా షూటింగ్ జనవరి 18న నుండి మొదలుకానుందట. కాగా మొదటి షెడ్యూల్ లో ఈ మూవీలోని కీలకమైన సీన్స్ ను షూట్ చేయనున్నారు. ఎమోషనల్ గా సాగే ఆ సీన్స్ లో రాజశేఖర్ తో పాటు మిగిలిన నటీనటులందరూ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజశేఖర్ పాత్రకు మరియు రాజశేఖర్ కూతురు పాత్రకు మధ్య వచ్చే సెంటిమెంట్ చాల బాగుంటుందని.. సినిమాలో ఆ సెంటిమెంట్ హైలైట్ అవ్వబోతుందని తెలుస్తోంది. అన్నట్టు ఈ చిత్రానికి ఇంగ్లీష్ సినిమా 'టోకెన్' ప్రేరణ అట. ఆ మూవీలోని మెయిన్ పాయింట్ ఆధారంగానే ఈ చిత్రం స్క్రిప్ట్ రాసుకున్నారట. కానీ ఏం లాభం సినిమా బాగున్నా ఓపెనింగ్స్ రావాలి కదా.

పైగా గరుడవేగ, కల్కి లాంటి చిత్రాలు తర్వాత తన నుండి ఈ సినిమా వస్తుండటంతో సహజంగానే (అసలు అంచనాలు లేకపోయినప్పటికీ) భారీ అంచనాలు ఉంటాయని రాజశేఖర్ ఫీల్ అవుతారనుకోండి. దాంతో ప్రమోషన్స్ కూడా సరిగ్గా ప్లాన్ చెయ్యరు. ఇక డైరెక్టర్ వీరభద్రం చౌదరి ట్రాక్ రికార్డ్, ఆయన గత సినిమా రిజల్ట్ దృష్టిలో పెట్టకుంటే ఈ చిత్రానికి కనీస బిజినెస్ జరుగుతుందా అనేది డౌటే. పాపం రాజశేఖర్ సినిమా బాగున్నా లాభం ఏముంది ?

Next Story
Share it