హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు, టీవీ యాంకర్‌ అలీకి మాతృ వియోగం జరిగింది. రాజమండ్రిలోని నటుడు అలీ సోదరి నివాసంలో తల్లి జైతన్‌ బీబీ నిన్న రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు. అలీ రాంచీనలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. సమాచారం అందుకున్న అలీ హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరాడు. రాజమండ్రి నుంచి అలీ తల్లి జైతన్‌ బీబీ భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తల్లిపై ఉన్న ప్రేమను అలీ పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం.. తన తల్లిదండ్రులేనని అలీ చెప్తు ఉంటారు. అలీ తన తండ్రి మహమ్మద్‌ బాషా చారిటిబుల్‌ ట్రస్ట్‌ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పేదలకు సేవ చేస్తున్నారు.

అంజి గోనె

Next Story