హైదరాబాద్‌: ఈ మధ్య హీరో అల్లు అర్జున్ ఏం చేసినా సంచ‌ల‌న‌మే అవుతోంది. ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో పాటు ఎప్పుడూ ఎదో వివాదాల్లో బన్నీ పేరు నానుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఓ సినిమా ఈవెంట్‌లో ‘చెప్ప‌ను బ్ర‌ద‌ర్’ అంటూ కామెంట్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌ ఆగ్ర‌హానికి గుర‌య్యాడో.. అప్ప‌ట్నుంచి మెగాఫ్యాన్స్‌ అత‌డిని మెగా ఫ్యామిలీ నుంచి వేరు చూసి చూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఓఈ చరిత్ర ఉంది. ఆ కుటుంబం నుంచి హీరోగా వచ్చిన అల్లు అర్జున్‌.. మెగా అభిమానుల అండదండలతో ఇండస్ట్రీలో స్టైలిష్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు.

అయితే తాజాగా అల్లు అర్జున్‌కు వ్యతిరేకంగా ఓ బ్యానర్‌ వెలిసింది. ‘తెలుగు సినిమా ప్రేక్షకులు ఇతనని హీరోగా పోషిస్తున్నారు. కానీ ఇతను మాత్రం తెలుగు సిని కార్మికుల పొట్ట కొడుతున్నాడు.. ఎందుకు?’ తెలుగు సినీ కార్మికుల ఐక్యత వర్ధల్లాలి అని బ్యానర్‌లో రాసి ఉంది. మరీ స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఎప్పుడు ఎవరిని ఇబ్బందులకు గురి చేశాడో తెలియాలి. అయితే ఈ బ్యానర్‌ను ఎవరూ రాయించారో, ఎవరో కట్టారో తెలియడం లేదు. దీనిపై అల్లు అర్జును ఎలా స్పందిస్తాడో చూడాలి మరీ.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.