భారత సరిహద్దులు తాకితే మడతేస్తారు.. జాగ్రత్త..!
By అంజి Published on 21 Nov 2019 12:28 PM ISTఢిల్లీ: భారత వాయుసేన అమ్ములపొదిలోకి మూడు రఫేల్ యుద్ధ విమానాలు చేరాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫ్రాన్స్‌లో ప్రస్తుతం వీటిని.. పైలట్లు, సహాయ సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి వినియోగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సృష్టం చేసింది. రఫేల్ రాకతో భారత వాయుసేనకు ఎక్కడలేని బలం వచ్చినట్లైంది. దీంతో ఆకాశ రాజ్యాన్ని ఎలేందుకు భారత వాయుసేనకు మార్గం సులభమైంది.
తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లోని డసో ఏవియేషన్ సంస్థ నుంచి అక్టోబర్ 8న అందుకున్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అనంతరం ఆయుధ పూజా కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే.. మిగితా రెండు యుద్ధ విమానాలను భారత్ ఎప్పుడు, ఎక్కడ స్వీకరించిందో మాత్రం ప్రభుత్వం సృష్టం చేయలేదు. కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీపాద్ నాయక్.. ఈ వివరాలను లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానం రూపంలో అందించారు. తొలి బ్యాచ్ రఫేల్ విమానాలు మే 2020లోగా భారత్‌కు చేరనున్నాయి. ఇందులో మొత్తం నాలుగు విమానాలుంటాయి. మొత్తం 36 విమానాలను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేసింది.
2012లో రఫేల్ విమానాల కొనుగోలు కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం డసో ఏవియేషన్ కంపెనీతో ఒప్పందం కుదర్చుకుంది. అయితే దీనిని 2015లో ప్రధాని నరేంద్రమోదీ ధరల నిర్ణయాన్ని సమర్థించి ముందుకు తీసుకువెళ్లారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో పారదర్శకత లోపించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. నిజాలను బయట పెట్టాలని ఏన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. దీంతో చివరకు రఫేల్ డీల్‌ను ఇరువర్గాలు సుప్రీంకోర్టులో తెల్చుకున్నాయి. రక్షణకు సంబంధించిన వ్యవహారాలను బయటపెట్టకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. రఫేల్ ఒప్పందంపై వచ్చిన విమర్శలపై డసో సంస్థ స్పందించింది. తమ భాగస్వామ్యంలో ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని డసో, రిలయన్స్ సంస్థ పేర్కొంది.
భారత్‌కు అమెరికా నావికా తుపాకులు..
సుమారు ఒక బిలియన్ డాలర్ల (రూ.7 వేల కోట్లు) విలువ చేసే నావికా తుపాకులను భారత్‌కు విక్రయించడానికి అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అగ్రరాజ్య కాంగ్రెస్‌కు తన నిర్ణయాన్ని నోటిఫికేషన్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆయుధాల వల్ల భారత నావికా దళం మరింత బలపడనుంది. శత్రువులకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలతో పోరాడటానికి ఈ నేవల్ గన్‌లను ఉపయోగించవచ్చు. వీటితో దేశ భద్రత మరింత మెరుగుపడుతుంది. ప్రతిపాదిత 13ఎమ్‌కే-45, 5ఇంచ్/62 కాలిబర్(ఎమ్‌ఓడీ4) నావికా తుపాకులు, సంబంధిత పరికరాల వ్యయం దాదాపు 1.02 బిలియన్ డాలర్లని అగ్రరాజ్య రక్షణ-భద్రతా సహకార సంస్థ తెలిపింది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలకు మాత్రమే ఎమ్‌ఓడీ4ను అమెరికా విక్రయించింది. తాజాగా ఈ జాబితాలోకి భారత్ చేరింది. మరిన్ని మిత్రదేశాలకు ఈ నావికా తుపాకులను అమ్మడానికి అగ్రరాజ్యం అమెరికా సిద్ధపడుతోంది.