నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

By సుభాష్  Published on  7 Sep 2020 2:20 AM GMT
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ వర్షాలకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రారంభంలో ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సంతాప తీర్మానాలు చేయనున్నారు. సంతాప తీర్మానం తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ, మండలి అజెండా, పని దినాలు నిర్ణయించనున్నారు.

అలాగే రేపు ప్రశ్నోత్తరాలను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి రద్దు చేశారు. సోమవారం 7.30 గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహిస్తారు. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన ఇతర బిల్లులపై మంత్రివర్గం చర్చించనుంది. మంగళవారం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శత జయంతి వేడుకల సందర్భంగా చర్చించే అవకాశం ఉంది.

అయితే నేటి నుంచి జరగనున్న శాసనసభ, మండలి సమావేశాలకు హాజరయ్యే ప్రతి సభ్యుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నెటిగిటివ్‌ ఉన్న సభ్యులకే సభలోకు అనుమతిస్తారు.

Next Story
Share it