నేడు ఇంటర్ ఫలితాలు.. ఫలితాల కోసం ఇలా చేయండి
By తోట వంశీ కుమార్ Published on 18 Jun 2020 8:34 AM ISTతెలంగాణలో ఇంటర్ ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మార్చిలో నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలు ఒకే సారి విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను మధ్యాహ్నాం 3 గంటలకు విడుదల చేస్తారని బోర్డు సెక్రటరీ సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. దాదాపు 9.50లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాల కోసం తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ చూడొచ్చు.
ఫలితాలను తెలుసుకోవాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి...
Step 1. https://tsbie.cgg.gov.in/ ఓపెన్ చేయండి.
Step 2. హోం పేజీలో ఇంటర్ ఫలితాలకు సంబంధించిన లింక్ పైన క్లిక్ చేయండి.
Step 3. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్‌కు వేర్వేరు లింక్స్ ఉంటాయి. మీకు కావాల్సిన లింక్ పై క్లిక్ చేయాలి.
Step 4. లింక్ ఓపెన్ చేసిన తరువాత హాల్ టికెట్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలు ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
Step5. ఫలితాల కాపీని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసి భద్రపర్చుకోవాలి.