తగ్గుతున్న బంగారం ధరలు.. వెండి కూడా అదే బాటలో

By సుభాష్  Published on  24 Aug 2020 4:52 PM IST
తగ్గుతున్న బంగారం ధరలు.. వెండి కూడా అదే బాటలో

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు కూడా అదేబాటలో నడిచాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.360 తగ్గి ప్రస్తుతం 50,480 వద్ద నిలిచింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.400 తగ్గుతూ ప్రస్తుతం రూ.55,060కి చేరింది. ఇక బంగారం తగ్గితే వెండి కూడా అదే దారిలో పయనిస్తోంది. కిలో వెండి ధరపై రూ.700 తగ్గి రూ.67వేలు ఉంది. ఇక విజయవాడ, విశాఖలలో కూడా బంగారం ధరలు అదే విధంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.360 తగ్గి రూ.50,480కి చేరుకుంది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ. 400 తగ్గి ప్రస్తుతం రూ.55,060 వద్ద నిలిచింది.

ఢిల్లీలో..

మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు కాస్త కిందికి కదిలాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.51వేల వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.350 తగ్గి ప్రస్తుతం రూ.55,600 ఉంది. ఇక వెండి ధర కూడా అదే విధంగా ఉంది. అయితే అంతర్జాతీయంగా బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Next Story