పడిపోయిన బంగారం ధర
By సుభాష్ Published on 24 Sept 2020 11:00 AM ISTబంగారం ధర మళ్లీ పడిపోయింది. ఈ రోజు కూడా దిగివచ్చిన పసిడి వరుసగా రెండు రోజులుగా తగ్గుతూ వస్తోంది. బంగారం కొనుగోలు చేసే వారికి ఇది శుభవార్తే. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదలతో దేశీ మార్కెట్‌లో పసిడి పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక బంగారం బాటనే వెండి కూడా పయనిస్తోంది.
హైదరాబాద్‌లో గురువారం బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.760 పడిపోయింది. దీంతో ప్రస్తుతం రూ.52,470కి చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.700 తగ్గి రూ.48,100కు క్షీణించింది.
అలాగే వెండి ధర కూడా అంతే. కిలో వెండిపై రూ.1600 తగ్గి, ప్రస్తుతం రూ.59వేలకు చేరుకుంది. యూనిట్లు,నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ధరల తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
మరో వైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర వెలవెలబోతోంది. ఔన్స్‌కు 0.36 శాతం క్షీణతతో 1861 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో వెళ్తోంది. వెండి ధర ఔన్స్‌కు 2.96 శాతం తగ్గుదలతో22.43 డాలర్లకు చేరుకుంది.
ఇక బుధవారం కూడా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం పసిడి ధర పడిపోగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.590 దిగొచ్చింది. దీంతో రూ.53,230కి పడిపోయింది. ఇక ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 తగ్గుదలతో రూ.48,800లకు దిగివచ్చింది. కాగా, బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలా ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, వాణిజ్య యుద్దాలు వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపుతాయి.