బిర్యానీ ప్రియులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఓ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం. బెంగళూరుకు చెందిన ఓ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం తమ వినియోగదారులకు ఈ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. తమ పెట్రోల్‌ బంక్‌లో ఇంధనం నింపుకొనే వినియోగదారులకు బిర్యానీ ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకుంది. తమ సేవలు ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వినియోగదారుల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీ వెంకటేశ్వర ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సర్వీస్‌ స్టేషన్‌ నిర్వాహకులు తెలిపారు.

ఓల్డ్‌ మద్రాస్‌ రోడ్డులోని ఈ ఔట్‌లెట్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్య కాంప్లిమెంటరీ ఫుడ్‌ ప్యాకెట్లు అందిస్తామని వెల్లడించారు. నెల రోజుల పాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నెల రోజుల పాటు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా వెజ్‌, నాన్‌వెజ్‌ వెరైటీలు రెండూ అందజేస్తామన్నారు.

అయితే ఫ్రీ బిర్యానీ అందించేందుకు ఈ పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం కొన్ని షరతులు విధించింది. రూ.2వేలు ఆపైన ఇంధనం నింపుకొనే వారికే ఈ బిర్యానీ ఉచితంగా ఇవ్వనున్నామని తెలిపింది. రూ.250 ఆపైన ఇంధనం నింపుకొనే వారికి కూడా బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపింది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.