రోడ్డు ప్రమాదంలో ఉద్యోగిని మృతి

By రాణి  Published on  28 Jan 2020 6:13 AM GMT
రోడ్డు ప్రమాదంలో ఉద్యోగిని మృతి

రోడ్డు ప్రమాదం ఆమె జీవితాన్ని కబళించింది. భాగ్యనగరంలోని యూసుఫ్ గూడలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉద్యోగిని మృతి చెందింది. జూబ్లిహిల్స్ లోని అపర్ణ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న సాయి దీపిక...తన స్కూటీపై ఆఫీసుకు వెళ్తోంది. యూసుఫ్ గూడ ప్రాంతంలో ఆమె ప్రయాణిస్తున్న స్కూటీ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీ కొట్టడంతో దీపిక గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నిజమాబాద్ లో...

నిజమాబాద్ జిల్లాలోని డిచ్ పల్లి మండలం నల్లవెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నాల్గవ తరగతి చదువుతున్న మున్నా అనే విద్యార్థి రెండు కాళ్లు బస్సు ఇంజన్ లో ఇరుక్కుపోయాయి. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు ఎంతో శ్రమించి గ్యాస్ కట్టర్ సహాయంతో ఇరుక్కుపోయిన విద్యార్థి కాళ్లను బయటికి తీశారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు విద్యార్థులకు కూడా గాయాలైనట్లు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో25 మంది విద్యార్థులున్నారు. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త కారణంగానే ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు.

Capture

Next Story
Share it