ఢిల్లీ: కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం కాని అయోధ్య కేసులో సుప్రీంకోర్టు నేడు తీర్పు చెప్పనుంది. అయోధ్య రామజన్మభూమిపై శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది తీర్పును వెలువరించనున్నారు. అయోధ్య తీర్పు నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న సున్నిత ప్రాంతాల్లో భారీ బలగాలను మోహరిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల డీజీపిలను అలర్ట్ చేసింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.