ఏపీ చరిత్రలో తొలిసారి.. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

By సుభాష్  Published on  16 Jun 2020 8:59 AM IST
ఏపీ చరిత్రలో తొలిసారి.. నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మంగళవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 16, 17 తేదీల్లో కేవలం రెండు రోజులే ఈ సమావేశంలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, ఆమోదించడం అన్ని చకచక జరిగిపోవాలి. కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉన్నందున ఈసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. అయితే మార్చిలోనే బడ్జెట్‌ సమావేశాలు జరగాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. దీంతో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిన మూడు నెలలకు ఓటాన్‌ బడ్జెట్‌ను ఆమోదం తెలిపింది జగన్‌ ప్రభుత్వం. ఇది చదవండి: బ్రేకింగ్‌: ప్రభుత్వం సంచలన నిర్ణయం: జూన్‌ 19 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌

కరోనా వైరస్‌ నేపథ్యంలో సంప్రదాయాలకు భిన్నంగా, అసాధారణ రీతిలో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. 16, 17 తేదీల్లో మాత్రమే ఈ సమావేశాలు జరగనున్నాయి. కాగా, ఈసారి బడ్జెట్‌ సమావేశాలకు ఉభసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించిన రోజునే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో నేడు శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించనున్నారు.

సాధారణంగా బడ్జెట్ సమావేశాలకు తొలిరోజు సమావేశాల ప్రారంభమవుతాయి. కనిష్ఠంగా రెండు వారాల నుంచి గరిష్ఠంగా ఆరు వారాల పాటు సాగే సంప్రదాయం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే విధానాన్ని అమలు చేసేవారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అసెంబ్లీ సమావేశాల సమయాన్ని కుదించేశారు. తాజాగా నిర్వహించనున్న సమావేశాలు రోటీన్ కు భిన్నంగా సాగనున్నాయి.

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఉదయం 10 గంటలకు గవర్నర్ విజయవాడలోని రాజ్ భవన్ నుంచే గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ఆన్ లైన్ లో ప్రసంగిస్తారు. దీన్ని వెలగపూడిలోని అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు వీక్షిస్తారు. గంట పాటు ఉండే ఈ ప్రసంగం తర్వాత ఉభయ సభలు ముగుస్తాయి. ఆ వెంటనే రెండు సభలకు చెందిన బీఏసీ సమావేశాల్ని విడిగా నిర్వహించనున్నారు. ఎజెండా ఫిక్స్ చేసిన తర్వాత రెండు సభలు కొలువు తీరనున్నాయి. ఆ వెంటనే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఇది చదవండి: జూన్‌ 16 తర్వాత భారత్‌లో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌.. నిజమేనా..?

ఈసారి సభలో సమయపాలనను ఖచ్చితంగా పాటిస్తూ సభ్యులను చర్చకు అనుమతిస్తారు. అనంతరం తీర్మానం ఆమోదించిన తర్వాత రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. దీన్ని కూడా వెంటనే ప్రతిపాదించటం.. చర్చను ప్రారంభించటం లాంటివి బ్యాక్ టు బ్యాక్ జరగనున్నాయి. పరిమిత చర్చ అనంతరం ఈ నెల 17న బడ్జెట్ కు ఆమోదం తెలిపటం ఖాయమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీ బడ్జెట్ సమావేశాల్ని ముగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి రోటీన్ కు భిన్నంగా చాలా వేగంగా సాగే ఈసారి అసెంబ్లీ సమావేశాలు చరిత్రలో నిలిచిపోవటం ఖాయమని చెప్పక తప్పదు. ఇది చదవండి: మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదు.. ఆ రాష్ట్రాలు క్లారిటీ ఇచ్చేశాయ్‌..!

Next Story