కరోనాతో ఎమ్మెల్యే మృతి

By సుభాష్  Published on  24 Jun 2020 10:33 AM IST
కరోనాతో ఎమ్మెల్యే మృతి

దేశంలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఎవ్వరిని కూడా వదిలిపెట్టడం లేదు. మృత్యువును వెంటాడుతోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంప వ్యాప్తంగా అతలాకుతలం చేస్తోంది. తాజాగా కరోనా మహమ్మారితో పశ్చిమబెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తమోనాష్‌ ఘోష్‌ (61) మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన కరోనా బారిన పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మృతి చెందారు.

కాగా, తమోనాష్‌ ఘోష్‌ రాజకీయ జీవితంలో ఎక్కువగా ప్రజాసేవకే అంకితం అయ్యారు. 1998 నుంచి పార్టీ కోశాధికారిగా ఉన్న ఆయన సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతో సేవలందించి మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా గెలిచి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే మృతిపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్విట్టర్‌ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.



Next Story