ఆ రోజున తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

అక్టోబరు 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.

By Kalasani Durgapraveen
Published on : 27 Oct 2024 8:15 PM IST

ఆ రోజున తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

అక్టోబరు 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. దీపావళి ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, దీపావళి రోజున సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతించరు. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుంది. అక్టోబరు 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 28 నుండి 30వ తేదీ వరకు జరగనున్న ప‌విత్రోత్స‌వాలకు అక్టోబరు 27వ తేదీన సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 28వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6.30 గంటలకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. రెండో రోజు అక్టోబ‌రు 29వ తేదీన మధ్యాహ్నం 12 గంటల‌కు పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు అక్టోబరు 30వ తేదీ రాత్రి 7 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

Next Story