తిరుమల దర్శనం.. తెరుచుకున్న శ్రీవారి మెట్టు మార్గం
తిరుమల శ్రీవారి మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచారు.
By Kalasani Durgapraveen Published on 18 Oct 2024 12:12 PMతిరుమల శ్రీవారి మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచారు. వాయుగుండం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురవడంతో టీటీడీ ముందస్తు జాగ్రత్త చర్యగా శ్రీవారి మెట్టు నడకదారిని అక్టోబర్ 17న మూసివేసింది. అలాగే పాప వినాశనం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు ప్రాంతాలకు యాత్రికులను పంపించడం కూడా ఆపివేశారు. అయితే నేటి నుండి భక్తులను శ్రీవారి మెట్టు మార్గం నుండి అనుమతిస్తూ ఉన్నారు అధికారులు.
తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అడిషనల్ ఈఓ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశించారు. తిరుమల ట్రాఫిక్ మేనేజ్మెంట్ పై స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై పలువురు అధికారులతో చర్చించారు. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. టీటీడీ, విజిలెన్స్, పోలీసులు, ఆర్టీఏ, టౌన్ ప్లానింగ్, ఏపీఎస్ ఆర్టీసీ, టీటీడీ ఇంజినీరింగ్, రెవెన్యూ, ట్రాన్స్ పోర్ట్ జీఎంలు కమిటీ గా ఏర్పడి వారం రోజుల లోపు సమస్యలను గుర్తించి పరిష్కారానికి సలహాలు, సూచనలు అందివ్వాలన్నారు.