సేవ్ తిరుమల, నిధులు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తిప్పికొట్టింది. ఆ ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది. టీటీడీకి సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెకింగ్ వెబ్‌సైట్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పష్టం చేసింది. ప్రధానమంత్రి కార్యాలయ నంబర్‌గా ఇచ్చిన నంబర్ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ కోసం టోల్-ఫ్రీ నంబర్. ఈ ఫోన్ నంబర్ మన్‌కీ బాత్ ప్రోగ్రామ్‌కు వారం ముందు మాత్రమే తెరవబడతాయి. ప్రజలు ఈ నకిలీ సందేశాన్ని షేర్ చేయవద్దని టీటీడీ కోరింది.
తిరుమల శ్రీవారికి భక్తులు అందించే కానుకల డిపాజిట్లను ఏపీ ప్రభుత్వం, టీటీడీ బోర్డు చైర్మన్ కలిసి తప్పుదోవ పట్టించారని వాట్సాప్‌లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. అయితే ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ తెలిపింది. ఆధారల్లేని ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.