శ్రీవారి భక్తులకు శుభవార్త
TTD Chairman tells good news for devotees.తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో
By తోట వంశీ కుమార్ Published on 14 Nov 2021 1:06 PM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ(తిరుమల తిరుపతి దేవస్థానం) అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పడుతుండడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడంతో గత రెండు మాసాలుగా భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతోంది టీటీడీ. ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు సర్వదర్శనం టోకెన్లను కూడా ఆన్ లైన్ ద్వారా అందిస్తోంది. ప్రస్తుతం ప్రతి రోజూ దాదాపు 30వేల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
కాగా.. శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలోనే భక్తుల సంఖ్యను మరింత పెంచనున్నట్లు తెలిపారు. భారీ వర్షాల కారణంగా నడకదారి భక్తులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. అధికారులతో చర్చించి భక్తుల సంఖ్య పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్ లోనా లేదా ఆఫ్ లైనా అనేది దానిపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కొన్ని సేవలను కూడా పునఃప్రారంభించాలని యోచిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.