తిరుమలలో పరకామణికి సంబంధించి రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారికంగా ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వినతిపత్రం సమర్పించారు.
పెద్ద జీయర్ తరుపున రవికుమార్ పరకామణిలో విదేశీ కరెన్సీ లెక్కింపులో పాల్గొన్నారని, రవికుమార్ చాలా ఏళ్లుగా దాదాపు రూ.200 కోట్ల విదేశీ కరెన్సీని రహస్యంగా బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. రవి కుమార్ తన శరీరంలో డబ్బును దాచుకునేలా శస్త్రచికిత్స చేయించుకున్నారని ఆరోపించారు. భద్రతా తనిఖీలను దాటవేయడానికి ఈ పని చేశారని ఆరోపించారు.