తిరుమలకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు నేరుగా ప్రత్యేక దర్శనం కల్పిస్తారని జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని శ్రీవారి భక్తులును తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కోరింది. మూడు నెలల ముందే ప్రతి నెలా 23వ తేదీన ఆన్‌లైన్ కోటా (రోజుకి 1000 మంది) విడుదల చేస్తామంది. అలా బుక్ చేసుకుని టికెట్లతో వచ్చిన వారినే అనుమతి ఇస్తామని తెలిపింది. తిరుమలలోని నంబి ఆలయం దగ్గర ఉన్న సీనియన్ సిటిన్/ పీహెచ్‌సీ లైన్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతిస్తారని తెలిపింది. భక్తులు సరైన సమాచారం కోసం టీటీడీ అధికార వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
ఇదిలా ఉంటే.. బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ మధుసూధన్ టీటీడీ అన్న ప్రసాదం ట్రస్టుకు కోటి రూపాయలను విరాళంగా అందించారు. ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవనంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.