శ్రీవారి భక్తులకు అలెర్ట్.. నేటి నుంచి తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం
Total plastic ban in Tirumala from Today.తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర
By తోట వంశీ కుమార్ Published on 1 Jun 2022 11:49 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో నేటి(బుధవారం, జూన్ 1 ) నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అలిపిరి టోల్‌గేట్ దగ్గరే తనిఖీలు నిర్వహించనున్నారు. ప్లాస్టిక్ రహిత వస్తువుల్ని మాత్రమే అనుమతించనున్నట్లు చెప్పింది. దుకాణదారులు, హోటళ్ల ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామన్నారు.
షాంపులు కూడా తిరుమలలో నిషేదించారు. అలాగే.. తిరుమలలో దుకాణదారులు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ ఇప్పటికే సూచించింది. పంచలు, బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయోడిగ్రేడబుల్ కవర్లు గానీ, పేపర్ కవర్లు గాని ఉపయోగించాలన్నారు. ఈ మార్పును గమనించి భక్తులు, దుకాణదారులు సహకరించాలని కోరింది.
ఇక.. తిరుమల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో పాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామాగ్రిని ఆలయాల్లోకి అనుమతించమని తెలిపింది. ఆలయానికి అనుబంధంగా ఉండే షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలు నిషేధిస్తామని చెప్పింది. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్నగా ప్లాస్టిక్ కవర్లు వినియోగాన్ని నిషేధించాలని అధికారుల నిర్ణయించారు. జూలై 1 నుంచి ప్రధాన ఆలయాలు అన్నింటిలో ప్లాస్టిక్ నిషేధించనున్నట్టు అధికారులు తెలిపారు.