విషాదం.. తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో వ్యక్తిని చంపిన సింహం

తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి జూపార్క్‌లోని సింహం ఎన్‌ క్లోజర్‌లోకి వెళ్లాడు

By Srikanth Gundamalla  Published on  15 Feb 2024 11:58 AM
tirupati, zoo park, lion, attack, man died,

విషాదం.. తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో వ్యక్తిని చంపిన సింహం

తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి జూపార్క్‌లోని సింహం ఎన్‌ క్లోజర్‌లోకి వెళ్లాడు. దాంతో.. అతడిపై దాడి చేసిన సింహం చంపేసింది. సందర్శకుడిని సింహం నోట కరచుకుని ఎత్తుకెళ్లి దాడి చేసి చంపేసింది. కాగా.. సింహం ఎన్‌ క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్‌ గుర్జర్‌గా గుర్తించారు. అతడిపై దాడిచేసిన సింహాన్ని అదికారులు బంధించినట్లు తెలుస్తోంది. సింహం వ్యక్తిపై దాడి చంపిసిన వార్త విన్న తిరుమల తిరుపతి భక్తులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. తిరుపతి ఎస్వీ జూపార్క్‌ ఘటన గురించి పోలీసులు సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి వెళ్లారు. సంఘటనపై డీఎస్పీ శరత్‌రాజ్‌ జూ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. జంతువులతో సెల్ఫీ తీసుకోవడానికే సదురు సందర్శకుడు ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక సింహం దగ్గరగా రావడంతో అప్పటికే చెట్టుపై ఉన్న వ్యక్తి భయంతో కింద పడిపోయినట్లు సమాచారం. ఇక వెంటనే ఆ సింహం వ్యక్తి తలను నోట కరుచుకుని అక్కడి నుంచి తీసుకెళ్లి చంపేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో జూపార్క్ అధికారులు అలర్ట్‌ అయ్యారు. ఇతర సందర్శకులకు పలు సూచనలు చేస్తున్నారు.

Next Story