తిరుమలలో ఉగ్రవాదుల కదలికపై.. క్లారిటీ ఇచ్చిన తిరుపతి పోలీసులు

తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి మెయిల్ రావడంతో పోలీసు వ్యవస్థ వెంటనే అప్రమత్తమైంది.

By అంజి  Published on  2 May 2023 12:00 PM IST
Tirupati police, terrorists, Tirumala Temple

తిరుమలలో ఉగ్రవాదుల కదలికపై.. క్లారిటీ ఇచ్చిన తిరుపతి పోలీసులు

తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి మెయిల్ రావడంతో పోలీసు వ్యవస్థ వెంటనే అప్రమత్తమైంది. తిరుమలలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి తనిఖీలు చేపట్టారు. అలిపిరి టోల్‌గేట్‌ వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. ఎస్పీకి ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై ఆరా తీయగా.. ఎట్టకేలకు అది నకిలీదని తేలింది. ఈ విషయమై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు లేవని స్పష్టం చేశారు. ఇలాంటి ఫేక్‌ వార్తలను భక్తులు నమ్మవద్దని సూచించారు. దీనిపై టీటీడీ సీవీఎస్వో నరసింహకిషోర్ మాట్లాడుతూ.. తిరుమలలో ఉగ్రవాద కదలికలున్నాయనడం పూర్తిగా అవాస్తవమన్నారు. కాగా, తిరుమల శ్రీవారి ఆలయానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాయి. దీంతో తిరుమలలోని కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Next Story