నల్లమల్ల అడవిలో అరుదైన చారిత్రక సంపదను వెలికితీసిన తిరుపతి హిస్టరీ లెక్చరర్
Tirupati history lecturer unearths rare historical treasures in Nallamalla forest. కందుల సావిత్రి తిరుపతి జిల్లాలోని
By న్యూస్‌మీటర్ తెలుగు
తిరుపతి: కందుల సావిత్రి తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాలలో హిస్టరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని నల్లమల్ల అడవి ప్రాంతంలో ఎత్తైన కొండ ప్రాంతం అయిన భైరవ కొండలో బౌద్ధ స్థూపం, చరిత్రపూర్వ గుహ, కొన్ని పురాతన శిల్పాలను 45 ఏళ్ల ప్రొపెసర్ కనుగొన్నారు. అయితే.. ఆమె ఎప్పుడూ తన పరిశోళనలను బహిరంగపరచలేదు.
సావిత్రి చారిత్రక కట్టడాలపై పరిశోధన చేస్తూ మూడు ఆలయాలను కనుగొన్నారు. శివాలయం, అమ్మవారి ఆలయం, భైరవ ముని ఆలయం. చివరి రెండు ఆలయాలు రాతితో నిర్మితమైతే, శివాలయం బౌద్ధ స్థూపం మాదిరిగానే నిర్మాణ శైలితో ఇటుకలతో నిర్మించబడింది.
డా. డి. వెంకటేశ్వర రెడ్డి పర్యవేక్షణలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి సావిత్రి తన పరిశోధనను ప్రారంభించారు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బోగోలు గ్రామంలో బౌద్ధ శాసనాలు ఉన్న శివాలయాన్ని (లక్ష్మన్న ఆలయం అని కూడా పిలుస్తారు) వెలికితీసింది. ఈ ఆలయం భైరవ కొండపై నల్లమల అడవిలో ఎత్తైన శిఖరంపై ఉంది.
మైసూరులోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ డైరెక్టరేట్ డైరెక్టర్ (ఎపిగ్రఫీ) డాక్టర్ కె. మునిరత్నంకు నేను ఈ శాసనాలను సమీక్ష కోసం పంపాను. అధ్యయన సమీక్షలో ఇటుక రాళ్లపై ఉన్న శాసనంలో ఇది ఒకప్పుడు బౌద్ధ మతానికి చెందినదని పేర్కొన్నట్లు తెలిసింది. కాలాముఖ శివభక్తుల బృందం 'ఉత్పతి పిడుగు - ఏకాంత నివాసి' అనే బిరుదులతో ఆలయాన్ని ధ్వంసం చేసి శివాలయాలుగా మార్చింది" అని సావిత్రి వివరించారు.
నల్లమల అటవీ ప్రాంతంలో కూడా బౌద్ధం వర్ధిల్లుతుందని ఆమె గుర్తించారు. 8వ శతాబ్దపు తెలుగు అక్షరాలు రాతి గోడ పైన "ఉత్పతి పిడుగు - ఏకాంత నివాసి" అనే పదబంధాలు,శివలింగం ముద్ర ఉన్నాయి. అంటే శివుడు ఒక్కడే దేవుడు అని నమ్మే బౌద్ధ దేవాలయాలను ధ్వంసం చేయడానికి ఒక సమూహం ఏర్పడింది.
రిస్క్ తీసుకుంటున్నారు
నల్లమల్ల అడవుల్లో, ముఖ్యంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో చాలా శాసనాలు ఉన్నాయనే ఆలోచనను తన గైడ్ తనకు చెప్పారని సావిత్రి చెప్పారు. స్థానిక గ్రామస్తులు సాధారణంగా కార్తీక మాసంలో సోమవారాల్లో గుంపులుగా మాత్రమే ఈ ఆలయాలను సందర్శిస్తారు. "20 మంది సభ్యుల బృందంతో, మేము నవంబర్‌లో ఒక సోమవారం ప్రారంభించాము. ఆ రాత్రి కొండ వద్ద బస చేశాము. వారిలో కొందరు పైకి ఎక్కలేక పోయినప్పుడు, నేను, నా బృందంలోని నలుగురు సభ్యులతో కలిసి లోపలికి వెళ్లి శాసనాలను కనుగొన్నాము "అని ఆమె చెప్పింది.
ఒక గుహ కనుగొనబడింది
చరిత్ర లెక్చరర్ భైరవ కొండ దేవాలయాలకు తూర్పు వైపున ఒక గుహను కూడా కనుగొన్నారు. అది చరిత్రపూర్వ ప్రజలు నిర్మించారు. "నాలుగు దేవాలయాలకు దారి చూపిస్తూ పెద్ద బండతో కూడిన గుహను నేను కనుగొన్నాను. బౌద్ధులు చరిత్రపూర్వ గుహలో నివసించారని చరిత్ర చెబుతోంది. సన్యాసులు గుహ యొక్క ఒక వైపు చక్కటి రాయిని చెక్కి, మరొక వైపు నుండి బయటకు వచ్చి గమ్యస్థానాలకు చేరుకుంటారు." అని సావిత్రి చెప్పింది.
న్యూస్ మీటర్‌తో మాట్లాడుతూ.., "చారిత్రక ఆలయాలలో కొత్త ఆవిష్కరణలు చేయడానికి నేను ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉంటాను. ఇది విజయవంతం అయినందున.. త్వరలో నా కొత్త పరిశోధనను సమీక్ష కోసం పంపుతాను" అని సావిత్రి తెలియజేశారు.