తిరుపతి ఉప ఎన్నిక.. లైన్ క్లియర్ అవ్వడంతో టీడీపీ, బీజేపీకి భారీ షాక్

Tirupati By Election. హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయలేమని స్పష్టం చేసింది.

By Medi Samrat  Published on  30 April 2021 2:55 PM IST
Tirupathi by elections

తిరుపతి ఉప ఎన్నిక సమయంలో భారీగా వైసీపీ అక్రమాలకు పాల్పడిందని టీడీపీ, బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో హై కోర్టును కూడా ఆశ్రయించారు. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలని బీజేపీ, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం వరకు అయిన ఉప ఎన్నిక రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించాయి. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. ఉప ఎన్నిక రద్దు చేయాలని అని దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కొట్టేసింది. ఈ సమయంలో ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పేసింది. దీంతో మే రెండున తిరుపతి ఉప ఎన్నిక ఫలితం రానుంది.

కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఉప ఎన్నిక రద్దవుతుందని ఇటు టీడీపీ, బీజేపీలు ఆశించగా.. వైసీపీకే అనుకూలంగా నిర్ణయం వచ్చింది. ఎన్నిక జరిగిన రోజు సైతం చాలా చోట్ల దొంగ ఓటర్లను పట్టుకుని ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు. బస్సుల్లో తమ మనుషులను తరలించామని చెబుతున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫోన్ సంభాషణను కూడా తమ ఫిర్యాదులో జత చేశారు. అక్రమాలు జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు ఉండడంతో ఉప ఎన్నికను న్యాయం స్థానం రద్దు చేస్తుందని ఆ రెండు పార్టీలు భావించాయి. ఈ సమయంలో ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు తేల్చి చెప్పింది. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం మే 2న వెలువడనుంది.

ఇక ఎగ్జిట్ పోల్ ఫలితాలు వైసీపీకే అనుకూలంగా వచ్చాయి. ఆరా సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీదే విజయం అని తేల్చేసింది. అధికార వైసీపీకి 63 శాతం ఓట్లు పడ్డాయని స్పష్టం చేసింది. టీడీపీకి 23.10 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పింది.


Next Story