తిరుమల కొండపై మరోసారి అలంటి ఘటనే..!
తిరుమల ఆలయం పై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లిందని.. తాము చూశామని పలువురు భక్తులు తెలిపారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Sept 2023 8:15 PM ISTతిరుమల కొండపై మరోసారి అలంటి ఘటనే..!
ఆగమశాస్త్ర నియామవళి ప్రకారం శ్రీవారి ఆలయంపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరకూడదు. తరచూ శ్రీవారి ఆలయం, వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం మీదుగా విమానాలు వెళ్లటం పైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి విమానం వెళ్ళింది. ఆలయం పై నుంచి మహాగోపురం మీదుగా విమానం వెళ్లిందని.. తాము చూశామని పలువురు భక్తులు తెలిపారు.
ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల పైనుంచి విమానాలు వెళ్లకూడదనే వాదన ఉంది. తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ పరిధిలోకి తేవాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా తిరుమల కొండపై తరుచుగా విమానాలు వెళ్తున్నాయి. తిరుమల కొండ గగనతలంపై నుంచి విమానాలు వెళ్లడం ఆగమశాస్త్ర నిబంధనలకు వ్యతిరేకమని టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. టీటీడీ అభ్యంతరాలను విమానయాన శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. తిరుమల కొండపై విమానాల రాకపోకలను నిషేధించాలని కేంద్ర హోం శాఖకు, పౌర విమానయానశాఖకు గతంలోనే తెలియజేశామని టీడీడీ అధికారులు చెబుతున్నారు. దేశభద్రత కోణంలో కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావటంతో దీని పైన పలు మార్లు టీటీడీ అధికార్లు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపినట్లు టీటీడీ చెబుతోంది.