తిరుమల ఘాట్‌ రోడ్డును ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగి పడిన ప్రాంతాన్ని ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌ కేఎస్‌ రావుతో కూడిన బృందం చూసింది. ఆ తర్వాత ఘాట్‌రోడ్డును పూర్తిగా పరిశీలన చేశారు. భాష్యకారుల సన్నిధి ప్రాంతంలో ఇప్పటికే భారీ బండరాళ్లు కూలాయి. అయితే అదే ప్రాంతంలో మరో బండరాయి పడే అవకాశం ఉండటంతో.. దానిని డ్రోన్‌ కెమెరా ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ కేఎస్‌ రావు మాట్లాడారు. ఎగువ ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగి పడే 12 ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. ఇటీవల వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను.. కొత్త సాంకేతికను వినియోగించి మరమ్మతులు చేయవచ్చన్నారు.

అధిక వర్షాలు పడటంతో 30 నుంచి 40 టన్నుల బరువు ఉన్న బండరాళ్లు కొండపై జారి విరిగిపడ్డాయని తెలిపారు. ప్రస్తుతం కొండచరియలు విరిగిపడి ధ్వంసంమైన రోడ్డు తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు మూడు నెలలకుపైగా సమయం అవకాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉంటే ఘాట్‌రోడ్డులో పడిన బండరాళ్లను టీటీడీ తొలగిస్తోంది. లింకు రోడ్డు దగ్గర భార బండరాళ్లు దొర్లుకుంటూ వచ్చాయి. దీంతో ఆ ప్రాంతంలోని చెట్లు, రాళ్లు పడిపోయాయి. వాటిని భారీ యంత్రాల సాయంతో పగలగొట్టి.. అక్కడి నుంచి తొలగిస్తున్నారు. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది. ఘాట్ రోడ్డు మరమ్మతులు పూర్తి అయ్యే వరకు డౌన్ ఘాట్ రోడ్డులోనే వాహనాల రాకపోకలు అనుమతించనున్నారు.

Admin2

Next Story