తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆయన్ను ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్లు అధికారులు అందజేశారు.
దర్శనం అనంతరం టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరి గవర్నర్‌ను పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా లు తిరుచనూర్ లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ను సందర్శించి పూజలు నిర్వహించారు.