శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల

Srivari Special Darshan February Quota tickets Released.క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వారిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2022 4:35 AM GMT
శ్రీవారి దర్శనం టికెట్లు విడుదల

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే స్వామి వారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) శుభ‌వార్త చెప్పింది. ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించిన శ్రీవారి ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేసింది. శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి శుక్ర‌వారం ఉద‌యం ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసింది. రోజుకి 12 వేల చొప్పున టోకెన్ల‌ను విడుద‌ల చేసింది.

రేపు( శ‌నివారం) ఉద‌యం 9 గంట‌ల‌కు టైం స్లాట్ స‌ర్వ‌ద‌ర్శ‌న టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. రోజుకు 10 వేల చొప్పున స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల‌ను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. అయితే.. ఫిబ్ర‌వ‌రి నెల‌లో ద‌ర్శ‌నం టికెట్ల‌ను పెంచుతార‌ని అంతా బావించారు. కాగా.. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప‌రిమితంగానే శ్రీవారి ద‌ర్శ‌న టికెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. భ‌క్తులంతా టికెట్ల‌ను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

ఇక‌ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారిని నిన్న 27,536 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.09 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 13,635 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Next Story
Share it