శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు విడుద‌ల.. 15 నిమిషాల్లోనే..!

Sri Venkateswara Swami Sarvadarshan tickets released in online.క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వారిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Dec 2021 5:12 AM GMT
శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు విడుద‌ల.. 15 నిమిషాల్లోనే..!

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. సోమ‌వారం శ్రీవారి స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్ల‌ను తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) ఆన్‌లైన్‌లో విడుద‌ల చేసింది. జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించిన టికెట్ల‌ను ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది.

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుంచి 22 వ‌ర‌కు రోజుకు ఐదువేలు, మిగిలిన రోజుల్లో రోజుకు ప‌ది వేల చొప్పున టికెట్ల‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే.. ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులోకి వ‌చ్చిన 15 నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. ఈ విష‌యం తెలియ‌క చాలా మంది భ‌క్తులు టికెట్ల కోసం లాగిన్ అవుతుండ‌డంతో వారికి నిరాశే మిగులుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్ల‌ను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేస్తోంది.

రేపు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు

రేపు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. మధ్యాహ్నం 3 గంటలకు జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను విడుదల చేయ‌నుంది. జనవరి 1, 13 తేదీల్లో రోజుకి వెయ్యి అలాగే జనవరి 14 నుండి 22వ వ‌ర‌కు రోజుకి 2 వేల టికెట్లు విడుదల చేయ‌నుంది. అలాగే మిగిలిన రోజులలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకి 200 చొప్పున, శని,ఆదివారాలలో రోజుకి 300 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లు విడుదల చేయ‌నున్న‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది.

Next Story