Tirumala : శ్రీవారి భక్తులకు అలర్ట్.. 27న రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల
ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను మార్చి 27న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు
By తోట వంశీ కుమార్ Published on
25 March 2023 6:16 AM GMT

ప్రతీకాత్మక చిత్రం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. స్వామి వారిని దర్శించుకుని కటాక్షం పొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలాంటి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) శుభవార్త చెప్పింది. ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 27న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.300 దర్శన టికెట్ల కోటాను ఈ నెల 27న ఉదయం 11 గంటలకు వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. కావాల్సిన భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Next Story