తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
By Srikanth Gundamalla Published on 27 Nov 2023 9:06 AM ISTతిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధానంత్రి హోదాలో మోదీ తిరుమలకు వెళ్లడం ఇది నాలుగోసారి. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో మహా ద్వారం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఆలయంలోకి వెళ్లారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆ తర్వాత శ్రీవారి దర్శనం తర్వాత ప్రధాని మోదీకి రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం.. ప్రధానికి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను టీటీడీ చైర్మన్ భూమన అందజేశారు. తిరుమలలో శ్రీవారిని ప్రధాని హోదాలో దర్శించుకోవడం ఇది నాలుగోసారి.
ప్రధాని మోదీ మూలవిరాట్టు దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. స్వామివారి శేషవస్త్రంతో ప్రదానిని సత్కరించారు. టీటీడీ ఆలయ అధికారులు ప్రధాని మోదీకి డెయిరీ, క్యాలెండర్‌ను కూడా అందించారు. ప్రధాని మోదీ సుమారు 50 నిమిషాల పాటు తిరుమల శ్రీవారి ఆలయలో గడిపారు. అనతరం రచన అతిథి గృహానికి చేరుకున్నారు. కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. ప్రధాని మోదీ పర్యటనతో తిరుమలలో ఆంక్షలు కొనసాగాయి. ప్రధాని వెళ్లే మార్గాల్లో ఉన్న దుకాణాలను మూసివేశారు. వాహనాల రాకపోకలను కూడా ఆపేశారు. ప్రధాని తిరుమల పర్యటనకు మీడియాను కూడా అనుమతించలేదు.